మతోన్మాదుల ప్రోద్బలంతోనే దళితులపై మూక దాడి

At the instigation of fanatics Gang attack on Dalits– కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు
– బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌
– జన్వాడలో బాధితులకు పరామర్శ
నవతెలంగాణ-శంకర్‌పల్లి
మతోన్మాదుల ప్రోద్బలంతోనే జన్వాడలో దళితులపై మూకదాడి జరిగింది.. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ, హత్య నేరం కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. అయితే గ్రామంలో 144సెక్షన్‌ అమల్లో ఉందని వారిని పోలీసు లు అడ్డుకున్నారు. దాంతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ.. రహదారి విషయంలో అగ్గిరాజేసిన మతోన్మాదులు ఒక పథకం ప్రకారం దళితులపైకి బీసీలను ఉసిగొల్పి దాడి చేయించారన్నారు. తక్షణమే పెత్తందారులను అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కొంత కాలంగా భజరంగ్‌దళ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు బీసీలలో హిందూత్వ విద్వేషాలు రెచ్చిగొట్టిన ఫలితంగానే మూకుమ్మడిగా ‘జైశ్రీరాం’ అంటూ రాళ్లు, కర్రలతో దళిత వాడపై దాడి చేశారన్నారు.
ఈ దాడిలో 12మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. దళిత వాడ చర్చి సమీపంలోని కాంపౌండ్‌ వాల్‌ విషయంలో పలు మార్లు గ్రామ సర్పంచ్‌కు మొరపెట్టుకున్నారని చెప్పారు. అయినా వినకుండా దాని మీదుగా రోడ్‌ వేస్తున్న క్రమంలో గ్రామ పెత్తందారులు గౌడిచర్ల నర్సిహ్మా, తలారి మైసయ్య కుమ్మరి శ్రీను, గోపాల్‌తోపాటు సుమారు 100మంది కలిసి దళితులపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌ తన భూమి కాపాడు కొని.. దళితుల భూమిని రోడ్డు కోసం వదిలిపెట్టాలని యత్నించారని, అందుకు దళితులు ఒప్పుకోకపోవడంతో ఈ దాడి జరిగిందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి భాస్కర్‌ మాట్లాడుతూ.. దళితులపై హత్యాయత్నం చేశారని, తక్షణమే నిందితులపై కేసులు నమోదు చేయాలన్నారు. గ్రామంలో దళితులను పూర్తి రక్షణ కల్పించాలన్నారు. పోలీసు ఉన్నతాధికారులు నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలన్నారు. దాడి చేసిన వారిని వదిలేసి దళి తులపై అక్రమకేసులు బనా యించారని, పరస్పర దాడు లు చిత్రీకరించడం సరికాద ని అన్నారు. తక్షణమే దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. దాడిలో గాయపడిన బాధి తులను పరామర్శించారు. ఈ పర్యటనలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చల్లా శోభన్‌, జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌, నాయకులు రుద్రకుమార్‌, కృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్‌ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్‌కుమార్‌, శ్రీనివాస్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ప్రకాష్‌ కారత్‌, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర వెంకటేష్‌, సీపీఐ(ఎం) శంక ర్‌పల్లి మండల కార్య దర్శి ఏనుగు మల్లారెడ్డి, ఎస్‌ఎఫ్‌ ఐ నాయకులు రవి, శ్రీను, సీఐటీయూ నాయకులు న్నారు.