శ్రీ సరస్వతి విద్యా మందిర్ లో మాక్ పోలింగ్..

నవతెలంగాణ- భీంగల్: శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించుటకు , ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియజేయుటకై మాదిరి ఎన్నికలను ( మాక్ పోలింగ్). ఈ ఎన్నికలలో బాలికల విభాగం నుండి 4గురు, బాలుర విభాగం నుండి 4గురు విద్యార్థులు పోటీ చేస్తూ తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించినారు. ఆ తర్వాత పోటీ చేస్తున్నవారు తరగతుల వారీగా విద్యార్థుల వద్దకు వెళ్లి తమకు ఓటు వెయ్యాలని ప్రచారం కూడా నిర్వహించినారు. తర్వాత విద్యార్థులే స్వయంగా ప్రిసైడింగ్ అధికారి, పోలింగ్ అధికారి బాధ్యతలను నిర్వర్తించి ఓటింగ్ విధానాన్ని చేపట్టగా 6 తరగతి నుండి 10 తరగతి విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ విధానం పూర్తయిన తర్వాత కౌంటింగ్ నిర్వహించగా బాలుర విభాగం నుండి పదవ తరగతి విద్యార్థి ఆర్. అశ్వంత్ గెలుపొందగా, బాలికల విభాగం నుండి పదవ తరగతి విద్యార్థిని సిహెచ్. సదాశ్రీ గెలుపొందింది. ఇట్టి విద్యార్థులకు రిటర్నింగ్ అధికారి ద్రువీకరణ పత్రాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులను మరియు ఈ ఎన్నికల కోసం విద్యార్థులను సంసిద్ధులు చేసిన సోషల్ ఆచార్య బృందమగు పి. సాయి చరణ్, టి శ్రీవాణి, ఎస్ స్రవంతి, పి రాజేందర్, డి సుబజ, పి. శిరీష, పల్లెర్ల మంజుల, ఎస్ అర్చన, వై. సునీల్ గారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. రవికుమార్, A.O జి. నర్సారెడ్డి మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.