నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ : పెద్ద కొడపగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్ కేంద్రాన్ని ఎన్నికల అధికారి మను చౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు అలహాధకారమైన వాతావరణంలో జరగలన్న ఉద్దేశ్యంతో ప్రతి మండల కేంద్రంలో మోడలింగ్ పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. యువత ఎన్నికలో ఓటు వేయకుండా ఉన్న వారికి ఎన్నికలు ఇలాంటి వాతావరణంలో ఉంటాయని తెలపడనికే మోడలింగ్ పోలింగ్ ను ఏర్పాటు చేయడం జరగిందని ఆయన తెలిపారు.ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో అధికారులకు సూచించారు.