– నేటి నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2024-25 విద్యాసంవత్సరంలో ఆరో తరగతిలో మొత్తం సీట్లతోపాటు ఏడు నుంచి పదో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఖాళీ సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్‌లో ఈనెల ఏడో తేదీన రాతపరీక్ష జరగనుంది. అదేరోజు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరో తరగతి, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏడు నుంచి పదో తరగతికి దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు ఎస్ శ్రీనివాసాచారి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 62,983 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు.telanganams.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా సోమవారం నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశముందని సూచించారు.