నవతెలంగాణ – తంగళ్ళపల్లి
మ్యాథ్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పరీక్షల్లో మోడల్ స్కూల్ విద్యార్థిని రాష్ట్రస్థాయికి ఎంపికయింది. ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలలో భాగంగా తెలంగాణ మాడ్స్ ఫోరం (TMF)ఆద్వర్యంలో సీరసిల్లలోని నిర్వహించిన జిల్లా స్థాయి ప్రతిభా పరీక్షలో మండలంలోని మండేపల్లి మోడల్ స్కూల్ పదవ తరగతి విద్యార్థిని M. అక్షయ పదవ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఈనెల 18న హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలు అక్షయ పాల్గొననున్నట్లు ఒక ప్రకటనలో ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రాజా నాయక్, పాఠశాల ప్రిన్సిపాల్ విట్టల్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందించారు.