ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మండల స్థాయి ఒలంపియాడు మరియు ఉపన్యాస పోటీలలో చల్వాయి మోడల్ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ గుండు కుమార్ తెలిపారు. శుక్రవారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ వారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మండల స్థాయి ఒలంపియాడ్ మరియు ఉపన్యాస పోటీలు ములుగు జిల్లా ఎల్తా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి మరియు ఎంఈఓ దివాకర్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన పోటీలలో చల్వాయి మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో మండల స్థాయి ఉపన్యాస పోటీలో కే మోహన 8వ తరగతి మొదటి బహుమతి మరియు బి రక్షిత ఎనిమిదో తరగతి రెండవ బహుమతి సాధించింది ఇంకొక విభాగంలో తెలంగాణ ఇంగ్లీష్ ఒలంపియాడ్ మండల స్థాయి పోటీలో పి స్నేహ తొమ్మిదవ తరగతి మొదటి బహుమతి కే సంజనా 9వ తరగతి రెండవ బహుమతి సాధించింది ఈ కాంపిటీషన్స్ లో పాల్గొన్న విద్యార్థులు అందరిలో మొదటి రెండు బహుమతులు రెండు విభాగాలలో సాధించినందుకు మోడల్ స్కూల్ సెలవా ప్రిన్సిపల్ గండు కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను మరియు గైడ్ టీచర్లను అభినందించారు ఇంగ్లీష్ ఉపాధ్యాయులు రాజగోపాల్, అపర్ణ మరియు ప్రణీత గార్లను ప్రత్యేకంగా విద్యార్థులను ఇంగ్లీషు ఒలంపియాడ్ లో రాణించేందుకు తీర్చిదిద్దినందుకు ప్రిన్సిపాల్ అభినందించారు. తొందర్లో ములుగు జిల్లా స్థాయి పోటీలలో ఈ విద్యార్థులు పాల్గొంటారు ఇటీవల చల్వాయి మోడల్ స్కూల్లో ప్రత్యేకంగా 6 7 8 వ తరగతి మరియు తొమ్మిదో తరగతి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు మొదలుపెట్టి వారికి ప్రతిరోజు క్రమం తప్పకుండా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించడానికి ప్రణాళిక చేసి అద్భుతంగా నడిపిస్తున్నారు* ఈ పరిణామ అనుసారంగా విద్యార్థులు ఈ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒలంపియాడ్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించడం పట్ల ప్రిన్సిపల్ గండు కుమార్ హర్షం వ్యక్తం చేశారు.