ట్రిపుల్ ఐటీకి ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులు

నవతెలంగాణ శంకరపట్నం: శంకరపట్నం మండల పరిధిలోని కేశవపట్నం మోడల్ స్కూల్ లో చదివిన 6 గురు విద్యార్థులు గట్టు స్పందన, తాళ్ల నిఖిల, రెడ్డి శ్రీనిధి, సుంక సంజన, ముస్కే కావ్య, కల్లెపెల్లి సంతోష్ కుమార్లు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్టు, ప్రిన్సిపాల్ చిట్టా జ్యోతి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జ్యోతి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అత్యుత్తమ మార్కులను పదవ తరగతిలో సాధించడంతో పాటు బాసర త్రిపుల్ ఐటీలో సీటు సాధించారని తెలిపారు.