– మంత్రి కోమటిరెడ్డికి పీఎంటీఏటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పీఎంటీఏటీఎస్ డైరీ, క్యాలెండర్‌ను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. మోడల్ స్కూళ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని మంత్రిని పీఎంటీఏటీఎస్ అధ్యక్షులు తరాల జగదీశ్ విజ్ఞప్తి చేశారు. బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని కోరారు. ఆరోగ్య కార్డులివ్వాలనీ, 010 పద్దు కింద వేతనాలివ్వాలని సూచించారు. మోడల్ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించాలనీ, అందుకోసం ప్రత్యేక నిధులను కేటాయించాలని తెలిపారు. ఈ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఎంటీఏటీఎస్ కార్యవర్గ సభ్యులు సలీం, శ్రీనివాస్, అనిల్‌కుమార్, నాగేశ్వరరావు, స్వామి, సీతారామరాజు పాల్గొన్నారు.