యూనివర్సిటీలో నమూనా పరీక్ష..

నవతెలంగాణ – డిచ్ పల్లి
గోల్కొండ అకాడమీ సౌజన్యంతో  రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రూప్-1, 2 గ్రాండ్ టెస్ట్ లో భాగంగా ఆదివారం తెలంగాణ యూనివర్సిటీలో గిరిజన శక్తి విద్యార్థి సంఘం, ఎన్ ఎస్ యుఐ ఆధ్వర్యంలో సంయుక్తంగా నమూనా పరీక్షను ఆదివారం నిర్వహించారు.  పరీక్షలను గిరిజన శక్తి విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీను రాథోడ్  దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న గ్రూప్-1, 2 ఇతరత్రా పోటీ పరీక్షలకు ఈ నమూనా పరీక్ష ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అభ్యర్థుల్లో దాగి ఉన్న భయాన్ని పరీక్షల ద్వారా తొలగించవచ్చని పేర్కొన్నారు.రాబోవు రోజుల్లో విద్యార్థుల సౌకర్యార్థం సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యుఐ నాయకులు సాగర్ నాయక్, రాజేందర్, నిర్వహాలు లక్ష్మణ్, శ్రీకాంత్, మోహన్, నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు.