
నవతెలంగాణ – కంఠేశ్వర్
దేశంలోనే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు ఎంతో ప్రత్యేకత ఉందని తమ ప్రభుత్వం లో ఇందూర్ మార్కెట్ యార్డును దేశంలోని ఉత్తమమైన మార్కెట్ యార్డ్ గా నెలకొల్పే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోద్దుటూరీ సుదర్శన్ రెడ్డి అన్నారు.ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ ( పాత గంజ్), హోల్ సెల్ విజిటేబుల్ మార్కేట్, శ్రద్దనంద్ గంజ్( వ్యవసాయ మార్కేట్ యార్డ్ ) లను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మార్కేట్ కమిటి చైర్మెన్ ముప్ప గంగారెడ్డి, అగ్రీకల్చర్ అండ్ ఫార్మర్స్ వేల్పెర్ కమీషన్ సభ్యులు గడుగు గంగాధర్, మార్కేటింగ్ అధికారులు పరిశీలించారు. నేతలు, వ్యవసాయ మార్కెట్ అధికారులు మార్కెట్కు వచ్చే రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంధర్బంగా సుధర్శన్ రెడ్డి మాట్లాడుతు….. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. నిజామాబాద్ లో పసుపు మార్కేట్ కు ప్రసిద్ధి అని రాష్ట్రంలో నిజామాబాద్ అతిపెద్ద వ్యవసాయ మార్కేట్ అని దానిలో మహిళ రైతులకు అధునిక సౌకర్యలు కల్పిస్తామన్నారు. హోల్ సెల్ విజీటేబుల్ మార్కేట్ లో అధనపు షెడ్ ల నిర్మాణం కోసం ప్రతిపాధనలు రాగా వాటిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన గాంధి గంజ్ ( మహ భూబ్ గంజ్) లో క్లాక్ టవర్ తో పాటు రిటైల్ వ్యాపారులకు సకల సౌకర్యాలు కలిపిస్తామన్నారు. ఈ సంధర్బంగా పసుపు మార్కేటింగ్ ప్రచార రథలను జండా ఉపి ప్రారంభించారు. ఈ సంధర్బంగా మార్కేట్ కమిటి చైర్మెన్ ముప్ప గంగారెడ్డి అధ్వర్యంలో పాలకవర్గం మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉర్దు అకాడమీ చైర్మెన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంధలయ సంస్థ చైర్మెన్ రాజారెడ్డి, మా ర్కేట్ కమిటి డైరెక్టర్లు, మార్కేటింగ్ అధికారులు, నాయకులు నగేష్ రెడ్డి, బాడ్సీ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గోన్నారు.