– చిత్తశుద్ధి లోపించింది
– బీజేపీ మ్యానిఫెస్టోపై కాంగ్రెస్
– ఇచ్చిన హామీలకే దిక్కులేదని ఎద్దేవా ప్రజా సమస్యల ప్రస్తావనేదని నిలదీత
న్యూఢిల్లీ : బీజేపీ ఎన్నికల ప్రణాళికపై ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యంగ్యోక్తులు విసిరింది. అందులో వాగాడంబరత ఎక్కువగా ఉన్నదని, అవాస్తవాలతో నిండిపోయిందని, చిత్తశుద్ధి లోపించిందని విమర్శించింది. దానిలో లెక్కించదగిన హామీలు తక్కువగానే ఉన్నాయని తెలిపింది. బీజేపీ మ్యానిఫెస్టోను ‘మోడీకీ గ్యారంటీ…జుమ్లా కీ గ్యారంటీ’ (మోడీ గ్యారంటీ వాగాడంబరతకు వారంటీ) అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన హామీలనే మోడీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో గుర్తు చేశారు. అందుకు డజనుకు పైగా ఉదాహరణలు చూపారు.
‘రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? స్వామినాథన్ కమిషన్ ఫార్ములాకు అనుగుణంగా కనీస మద్దతు ధరలు కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తామన్నారు. అవన్నీ ఏమయ్యాయి?’ అని ఖర్గే నిలదీశారు. కాగా ప్రజలను వేధిస్తున్న నిరుద్యోగం, ధరల పెరుగుదలపై బీజేపీ ప్రణాళిక మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రజల బాగోగులకు కీలకమైన అంశాలను చర్చించడం బీజేపీకి ఇష్టం లేదని ఆయన అన్నారు.
బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో 76 పేజీలు ఉన్నాయని, అయితే వాటిలో ‘ఉద్యోగాలు’ అనే ప్రస్తావన కేవలం రెండు చోట్ల మాత్రమే కన్పించిందని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా ష్రినాటే గుర్తు చేశారు. ‘ఏడాదికి 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, అప్రెంటీస్‌షిప్ కోసం స్టైఫండ్‌గా ఏటా లక్ష రూపాయల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే బీజేపీ ప్రణాళిక మాత్రం ప్రస్తుత ఖాళీల భర్తీని మాత్రమే ప్రస్తావించింది. ఖాళీలను భర్తీ చేయకుండా అలాగే ఉంచేస్తూ గత దశాబ్ద కాలంగా ఉద్యోగాల కల్పనపై ఎందుకు ఊదరకొడుతున్నారు?’ అని ఆమె ప్రశ్నించారు.
వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరల అమలుపై చట్టాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగా ఈ విషయంపై బీజేపీ మౌనం వహించింది. 2022 నాటికి అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2019లో ఇచ్చిన హామీపై కూడా మౌనాన్నే ఆశ్రయించింది. గత పది సంవత్సరాల కాలంలో కనీస మద్దతు ధరలు అసాధారణ రీతిలో పెరిగాయని మాత్రం చెప్పుకుంది. వాటిని ఎప్పటికప్పుడు పెంచుతామని హామీ ఇచ్చింది. ఉగ్రవాదంపై బీజేపీ ప్రణాళికలో చేసిన వాదనను కాంగ్రెస్ కొట్టిపారేసింది. 2014 తర్వాత ఏ ప్రధాన నగరంలోనూ చెప్పుకోదగిన ఉగ్రవాద దాడి జరగలేదని బీజేపీ చెబుతోంది. అయితే పుల్వామా సహా పలు ఉగ్రవాద దాడులను ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది.
పది సంవత్సరాల మోడీ పాలనలో ఒక్క జమ్మూకాశ్మీర్‌లోనే 3,950 మంది ఉగ్ర దాడులకు బలయ్యారని సుప్రియ తెలిపారు. వీరిలో భద్రతా సిబ్బంది, పౌరులు ఉన్నారని అంటూ దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేశామంటూ బీజేపీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో మణిపూర్‌ను ప్రస్తావించకపోవడాన్ని కూడా కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించిన బీజేపీ, మణిపూర్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. న