రాహుల్ గాంధీ పై మోడీ కుట్రపూరితమైన కేసులు

 – మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్: రాహుల్ గాంధీపై నరేంద్ర మోడీ కుట్రపూరితమైన కేసులు పెడుతూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొనసాగే విధంగా సూరత్ హైకోర్టులో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడని నిరసిస్తూ శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు పి ఎం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీని పార్లమెంటుకు రాకుండా అడ్డుకోవడం కోసం బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. దేశంలో రాష్ట్రంలో ఎన్నో పెండింగ్ కేసులు ఉండగా అతి ఉత్సాహంతో బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బంక చందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కౌన్సిలర్స్ భూక్య సరోజన, వల్లపు రాజు, విద్యాసాగర్ మారుపాక గణేష్ , ముడిక ప్రశాంత్, పోగుల రాజ్ కుమార్, పంపరి సంపత్, చుంచు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.