నవతెలంగాణ-సదాశివపేట
కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ కార్మిక హక్కులను కాలరాస్తున్నదని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం ఆరోపించారు. మతతత్వ ఎజెండాను దేశంలో అమలు జరుపుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలంలోని నందికంది గ్రామంలో శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి.. నేడు ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారన్నారు. నిరుద్యోగం గత 50ఏండ్ల గరిష్ట స్థాయికి చేరిందన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్‌లను పెట్టుబడుదాలకు అనుకూలంగా తయారు చేసిందన్నారు. 8 గంటల పని స్థానంలో పన్నెండు గంటల పని విధానం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నదన్నారు. ప్రజల మధ్య వైశ్యమ్యాలను రెచ్చగొట్టడానికి మతతత్వ ఎజెండాను అమలు చేస్తుందన్నారు. ఈ పదేండ్ల కాలంలో బడా కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మిక రైతు కర్షక ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ జరిగే దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వి.ప్రవీణ్ కుమార్ సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, శ్రీనివాస్, ఎన్ మల్లేశం, రవి జనార్ధన్, సంజీవులు, వీరేశం, పాండు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారం: మండల పరిధిలోని పారిశ్రామిక వాడలో గల అరబిందో, మైలాన్, శక్తి హార్మోన్‌తో పాటు పలు పరిశ్రమల యాజమాన్యానికి ఫిబ్రవరి 16న తలపెట్టిిన సమ్మె నోటీసును సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కే.రాజయ్య స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం పెట్టు బడిదారులకు, కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలను అవలంభిస్తున్నదన్నారు.కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసున్న దనన్నారు. అధికారాన్ని చేజెక్కించుకోవడమే లక్ష్యంగా మత రాజకీయాలకు పాల్పడుతోందని ఎద్దేవా చేశారు. ధరలు పెరుగుదల, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, రైతాంగం సమ స్యలు ఆత్మV ాత్యల ఓవైపు దేశంలో విలయతాండవం చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. మోడీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటు న్నాయని.. ఈ సమ్మెకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు నాగేశ్వరరావు, మండల నాయకులు ప్రభు, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్: ఈనెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరు కార్మికులపై ఉన్నదని వీవోఏల మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తున్నదన్నారు. అలాంటి ప్రజా వ్యతిరేక విధనాలను నిరసిస్తూ జరగనునన దేశవ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొనాలన్నారు.