నవతెలంగాణ – అచ్చంపేట
డీజిల్ పెట్రోల్ నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని ఐఎన్టియుసి తాలుక అధ్యక్షులు మహబూబ్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం నవ తెలంగాణతో ఆయన మాట్లాడారు. సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితికి దిగజార్చిన ఘనత బిజెపి దక్కిందన్నారు. పార్లమెంటు సమావేశం లో ధరలు తగ్గిస్తూ బిల్లు ఆమోదపరచాలన్నారు. మధ్యతరగతి కుటుంబాలు సాలిసాలని సంపాదన రోజు కూలికి వెళితే రూ.300, రూ.500 మాత్రమే ఇస్తున్నారు. ఇవ్వాళ కూరగాయలు ధరలు , పప్పు, నూనె , చింతపండు కొనలేని పరిస్థితి ఉంది అన్నారు. ఆర్థిక పరిస్థితుల సమస్యల కారణంగా సామాన్య కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నవి, భార్య భర్తల మధ్య గొడవలు ఏర్పడుతున్నాయన్నారు. రేషన్ దుకాణాలలో బియ్యంతో పాటు కందిపప్పు, మంచినూనె, పసుపు, గోధుమలు, గోధుమపిండి, చింతపండు, మొదలగు నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని మహబూబ్ ఆలీ డిమాండ్ చేశారు.