మోడీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి: సీపీఐ(ఎం.ఎల్)

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రైతులపై దాడులకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్  డిమాండ్ చేశారు. శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా  పిలుపు లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద  సీపీఐ(ఎం.ఎల్ )మాస్ లైన్ (ప్రజాపంథా)ఆధ్వర్యంలో బ్లాక్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపించారని, ప్రభుత్వం మెడలు వంచి నల్ల చట్టాలు రద్దు చేయాలనే డిమాండ్ ను మోడీ ప్రభుత్వం అంగీకరించిన నేటికి అమలుకు పూనుకోలేదన్నారు. దీనికి నిరసనగా దేశం నలుమూలల నుండి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమం చేస్తుంటే, వారిపై టియ్యర్ గ్యాస్ ఉపయోగించడం, రబ్బర్ తూటాలతో కాల్పులు జరిపి రైతు ల ప్రాణాలు బలిగొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.  రైతులపై మోడీ ప్రభుత్వం పరోక్షంగా చేస్తున్న కిరాయి హత్యలన్నారు. స్వామినాధన్ కమిటీ సిపారస్ లను అమలు చేయాలనీ, రైతు పండించే పంట కు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. కాల్పుల్లో మరణించిన రైతు కుబుంబానికి  రూ. కోటి  ఎక్స్ గ్రేషియా చెల్లించి, రైతులపై చేస్తున్న దాడులను వెంటనే ఆపి,సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పి‌డి‌ఎస్‌యూ రాష్ర్ట సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రమేష్, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు చంద్రకళ,ఉపాధ్యక్షులు రేణుక,కోశాధికారి జయమ్మ, ఐఎఫ్టియు జిల్లా సహయ కార్యదర్శి వీరబాబు, జిల్లా కమిటీ సభ్యులు చిత్తలూరి లింగయ్య,శ్రీకాంత్, వినయ్,పద్మ,సునిల్ తదితరులు పాల్గొన్నారు.