మోడీ ‘ఫోబియా’

పెట్టుబడులకు, కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు తెలుగు దినపత్రికలు అన్నారు శ్రీశ్రీ. ఆ రోజుల్లో తెలుగు మీడియా వాస్తవ పరిస్థితులను ఆయన కండ్లకు కట్టారు. కానీ నేడు ఒక్క తెలంగాణే కాదు దేశంలోని మెజార్టీ మీడియా పెట్టుబడులకు, కట్టుకథలకు మానస పుత్రికలుగా తయారయ్యాయి. భారతీయ మీడియా రంగానికి మోఢ ఫోబియా పట్టుకుంది. నిరుద్యోగం, ఆకలి, ద్రవ్యోల్బణం, కుదేలవుతున్న వ్యవసాయరంగం తదితర అనేక సమస్యలను గాలికొదిలేసి అయోధ్య రామమందిరం, సీఏఏ, దేశభక్తి, జాతీయతవాదం పేరిట ప్రజల్లో భావోధ్వేగాలను రెచ్చ గొడుతున్నాయి. మరోసారీ కాషాయ దళాన్ని గద్దెనెక్కించేందుకు వీరుడు, శూరుడు అంటూ మోడీ జపం చేస్తున్నాయి. నిన్నటివరకు ప్రజాస్వామ్యపు నాలుగు స్తంభాల్లో ఒకటిగా మన్ననలందుకున్న మీడియా నేడు ప్రజల దృష్టిలో పలచ నైంది. అబద్దాలను, అసత్యాలను ప్రచారం చేస్తూ మోడీని మార్కెట్‌ చేస్తున్న తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరెన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా రాబోయే ఎన్నికల్లో కాషాయ దళపతికి శృంగభంగం తప్పదు.
– కె.నరహరి