నవతెలంగాణ – మోర్తాడు
పరీక్ష పత్రాల లీకేజీ పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ అన్నారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీటి పరీక్షలు రద్దు చేస్తూ విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని 23 లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్న బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. పేపర్ లీకేజీ పై మోడీ ఎందుకు స్పందించడం లేదని దీని వెనుక ఆంతర్యం ఏముందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రభుత్వాలకు యువత గుణపాఠం చెప్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ ఏరియా నాయకులు మహేష్ విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.