– చనగాని దయాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదేండ్లు రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేననీ, ఆ పార్టీలను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు కమలం పార్టీ నాయకులే కారణం కాదా? అని ప్రశ్నించారు. దోషులను శిక్షించేంత వరకు రోహిత్ వేముల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనీ, సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని తెలిపారు.