– చరణ్ విశ్వకర్మ అచ్చంపేట యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
నవతెలంగాణ: అచ్చంపేట:-
విశ్వకర్మ కౌసల్ యోజన పథకం పేరుతో చేతి వృత్తుల వారి కుటుంబాలకు లక్ష రూపాయలు చేయూత నిస్తనాన్ని చెప్పిన మోడీ మాటలు గారడి మాటలే అయ్యాయి అని చరణ్ విశ్వకర్మ అచ్చంపేట జనరల్ సెక్రటరీ విమర్శించారు. చేతి వృత్తుల కుటుంబాల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం ఇప్పటి వరకు తెలంగాణలో అమలు కాలేదు దాంతో చేతి వృత్తుల వారు మోడీ అబ్బాద్దపు వాగ్దానానికి మొసపోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో విశ్వకర్మలు బీజేపీ కి ఓటు బ్యాంక్గా వున్నారు అయిన కూడా వారికి బీజేపీ నాయకత్వం మొండి చేయి చూపించింది. సెప్టెంబర్ 17 న అట్టహాసంగా మోదీ ఈ పథకాన్ని ప్రారంభించి 6 నెలలుగా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ ఒక్కరికి కూడా ఇచ్చిన పాపాన పోలేదు దాంతో ఎలెక్షన్ కోడ్ కూడా వచ్చింది ప్రజలకు ఈ పథకం ఉట్టి నీటి మాటలుగా మిగిలింది.ఈ విధంగా ఈ పథకం లో 18 కులాలను చేర్చి వారిని అందరిని మోసం చేసిందని ఈ సారి విశ్వకర్మ లు కళ్ళు తెరచి బీజేపీకి మద్దత్తు ఇవ్వడం బందుచేయలని కోరారు