అనైతిక పద్ధతుల్లో గద్దె నెక్కేందుకు మోడీ యత్నం

–  సంపత్‌ కుమార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆయా రాష్ట్రాల్లో అనైతిక పద్ధతుల్లో గద్దెనెక్కాలని ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని ఏఐసిసి కార్యదర్శి సంపత్‌ కుమార్‌ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సంపత్‌ మీడియాతో మాట్లాడారు. జార్కండ్‌ ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో రక్ష కల్పించామనీ, దేశంలో ప్రజాస్వామ్యం గెలుస్తుందని ఆ రాష్ట్రంలో విషయంలో నిరూపితమైందని తెలిపారు. అదే విధంగా ఈ నెల 12న బీహార్‌లో మరోసారి ప్రజాస్వామ్యం గెలుస్తుందని తెలిపారు. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు వచ్చే నెల 11 వరకు హైదరాబాద్‌లో రక్షణ కల్పిస్తున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.