ఎమ్మెల్యే జారే కు శుభాకాంక్షలు తెలిపిన మొగళ్ళపు 

నవతెలంగాణ – అశ్వారావుపేట

స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పుట్టిన రోజు వేడుకలను నియోజక వర్గం వ్యాప్తంగా సోమవారం పార్టీ శ్రేణులు,అభిమానులు ఘనంగా నిర్వహించారు. అశ్వారావుపేట పీఏసీఎస్ మాజీ అద్యక్షులు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవరావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జారే ఆదినారాయణ కు శాలువా కప్పి,తీపి మిఠాయిలు పంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట నాయకులు జ్యేష్ట సత్యనారాయణ చౌదరి,కొల్లు వెంకట రమణ లు ఉన్నారు.