ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మొగుళ్ల రాజిరెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కాంగ్రెస్‌ నాయకులు మొగుళ్ల రాజిరెడ్డిని ఆ యూనియన్‌ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి నియమించారు. ఈమేరకు ఆదివారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. జనగామ జిల్లాకు చెందిన ఆయన ఇప్పటికే హైదరాబాద్‌ జలమండలి కామ్గార్‌ యూనియన్‌ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. భవిష్యత్తులో యూనియన్‌ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.