రెంజల్ మండలంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్ మహమ్మద్ బషీరుద్దీన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 19 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిలో 9 పాఠశాలకు పక్కా భవనాలు ఉండగా అద్దె భవనాలలో కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 100% సాధించారని ఆయన స్పష్టం చేశారు. కోటగిరి పాఠశాలలో బస చేసి పాఠశాల పనితీరును పరిశీలించడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో సుమారుగా 7000 మంది విద్యార్థినిలు చదువులను కొనసాగిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. రెంజల్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదో తరగతి నుంచి పదవ తరగతి 382 మంది బాలికలు, ఇంటర్మీడియట్ లో 160 మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కెమిస్ట్రీ లెక్చరర్ అనారోగ్యంతో నాలుగు నెలలు సెలవు పై వెళ్లగా, ఆమె స్థానంలో కొత్తవారిని వారం రోజుల్లోపు తీసుకోవడం జరుగుతుంది అని పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్సియా నజాం తెలిపారు. ఈ 19 పాఠశాలలో ఖాళీగా ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేయడానికి ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట పాఠశాల ప్రిన్సిపల్ ఆర్షియా నజాం ఉన్నారు.