నవ వధూవరులను ఆశీర్వదించిన మోహన్ నాయక్

నవ వధూవరులను ఆశీర్వదించిన మోహన్ నాయక్నవతెలంగాణ-నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హీల్ కాలనీ లోని  కమ్మ సేవా సంఘం ఫంక్షన్ హాల్ నందు  నేనావత్ బిచ్చు నాయక్(లేట్), అనసూయ దంపతుల కనిష్ట పుత్రిక నవ వధూవరులు అలివేలు,శ్రావణ్ కుమార్ ల వివాహ మహోత్సవానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాగార్జునసాగర్ పట్టణ అధ్యక్షులు రమావత్ మోహన్ నాయక్ హాజరై నవ వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. వీరి వెంట ముఖ్య అతిథులుగా నందికొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ మంగత నాయక్,చంద్రయ్య,సైదా నాయక్,హనుమంతు,రంగ నాయక్,బద్య నాయక్,వెంకట్, మధుసూదన్ సైదులు తదితరులు పాల్గొన్నారు.