కార్యకర్త అంత్యక్రియల్లో మోహన్ రెడ్డి

నవతెలంగాణ-నవీపేట్: మండలంలోని హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త నరేష్ గుండెపోటుతో మృతి చెందడంతో సోమవారం బిజెపి నాయకులతో కలిసి వడ్డీ మోహన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. అకాల మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని అంకితభావం కలిగిన కార్యకర్తను కోల్పోవడం తీరనిలోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించి భరోసా ఇచ్చారు.