సీఎం సలహాదారున్ని కలిసిన మోహన్ రెడ్డి

నవతెలంగాణ – రామారెడ్డి
 సీఎం సలహాదారు గా నియమితులైన వేం నరేందర్ రెడ్డిని మంగళవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ… అనుభవాన్ని గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి సలహాదారుల నియమించడం శుభ పరిణామమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి సూచనలు ఇస్తూ తెలంగాణ అభివృద్ధిలో తన వంతు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నరేందర్ రెడ్డిని నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గేకు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.