నవతెలంగాణ -నవీపేట్: మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ఏడు రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి బుధవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్మికులు చాలీచాలని వేతనాలతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెంటనే న్యాయమైన సమ్మె డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మానుకొని సమస్యలను పరిష్కరించి కార్మికులను ఆదుకోవాలని అన్నారు. కార్మికుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మువ్వ నాగేశ్వరరావు, ఆనంద్, సత్యం రెడ్డి, బాలగంగాధర్, రమణారావు తదితరులు పాల్గొన్నారు.