మండలంలో ఘనంగా మొహర్రం

Navatelangana,Telugu News,Telangana,Rangareddy,నవతెలంగాణ-తాండూర్‌ రూరల్‌
మండలంలోని ఎల్మకన్న, గుంతబాస్‌పల్లి, కరణ్‌ కోట తదితర గ్రామాలలో మొహర్రం పండగ పురస్కరించుకుని హిందూ, ముస్లింలు కలిసిమెలిసి ఐదు రోజులపాటు అలైదులై ఆటాపాటలతో జరుపుకున్నారు. బుధవారం చివరి రోజు కావడంతో డప్పు వాయిద్యాలతో పిల్లలను ఊరేగిం పుగా తీసుకెళ్లి, పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ జగదీష్‌, ప్రజా ప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు.
త్యాగానికి ప్రతీక మొహర్రం
నవతెలంగాణ-షాబాద్‌
మండల కేంద్రంతో పాటు నాగర్‌గూడ, తాళ్లపల్లి, తిరుమలాపూర్‌, రుద్రారం, హైతాబాద్‌, ఎట్లార్రవల్లి, రేగడి దోస్త్వాడ, తదితర గ్రామాల్లో కులమతాలకతీతంగ మొహర్రం పండుగ ఘనంగా జరుపుకున్నారు. మహమ్మద్‌ ప్రవక్త మనుమడి ఇమామ్‌ ఇమాం ఉషన్‌ బలిదానాన్ని స్మరిస్తూ ముస్లింలు ఏటా మొహరం వేడుకలు నిర్వహించడం సంప్రదాయకంగా నిర్వహించుకుంటు న్నారు. ఈ నెల 10వ తేదీన మొదలైన మొహర్రం వేడుకలు తొమ్మిది రోజులు పల్లె, పట్టణాల్లో ఊరేగించి మసీదుకు చేరుస్తారు. రాత్రి వేళ్లలో పీర్ల మసీద ఎదుట అగ్నిగుండం ఏర్పాటు చేసి అలావ్‌ ఆడుతారు. కులమతాలకు అతీతంగా పలువురు దట్టీలు సమర్పించి, మొక్కులు చెల్లించుకుంటారు. బుధవారం బెల్లం పానకం తయారు చేసి పంపిణీ చేస్తారు. పీర్లను తిరిగి ఊరేగించి చెరువులో నిమజ్జనం చేస్తారు. మండల కేంద్రంలో మత ప్రదర్శన మొహరం వేడుకల సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.