కొయ్యుర్ నుంచి రుద్రారం వరకు డబుల్ రోడ్డుకు మోక్షం 

– హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
– మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీపీ
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని పట్టణంలోని గోదావరి నదిపై వంతెన నిర్మాణం కోసం  రూ.125 కోట్లు, మండలంలోని కొయ్యుర్ నుంచి రుద్రారం వరకు 13 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డుకు రూ.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని,నిధుల కేటాయింపునకు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజురైయ్యేలా కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు మండల ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కొయ్యుర్ నుంచి రుద్రారం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం ఎప్పుడెప్పుడని ప్రజల చిరకాల కోరికకు మోక్షం కలిగిందన్నారు.అలాగే తాడిచెర్ల నుంచి నాగులమ్మ, ఖమ్మంపల్లి టు భూపాలపల్లి జిల్లా కేంద్రం వరకు అతి త్వరలోనే తారు రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.