రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రి మొల్ల

నవతెలంగాణ – తుంగతుర్తి
రామాయణాన్ని అతి సులువైన పదాలతో తెలుగులో రాసి,తన సరళమైన పదజాలానికి అందరూ ముగ్ధులయ్యేలా చేసిన గొప్ప కవయిత్రి మొల్ల అని శాలివాహన సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షులు మద్దికుంట్ల ఎల్లయ్య అన్నారు. బుధవారం మొల్ల జయంతి ఉత్సవాల సందర్భంగా శాలివాహన సంఘం ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. ఈ సందర్భంగా రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రిగా ఆమె రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని అన్నారు. మొల్ల రామాయణం మొత్తం ఆరుకాండాలలో 871 పద్యాలతో కూడుకుందని ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతి.. మొల్ల కుమ్మరి కుటుంబంలో జన్మించిందని, శ్రీకృష్ణదేవరాయల సమయంలోనదని ప్రసిద్ధి ,మొల్ల రచనలను చదివిన వారు మొల్ల రచనాశైలి చాలా సరళమైందని రమణీయమైనదని పలువురి అభిప్రాయం. ఈ కార్యక్రమంలో మద్దికుంట్ల సత్యనారాయణ, మద్దికుంట్ల సుధాకర్,శ్రీనివాస్,రవి,వెంకన్న,మల్లేశం,వెలిశాల పాండు తదితరులు పాల్గొన్నారు.