కోతులు… కుక్కలతో పరేషాన్.!పట్టించుకోని అధికారులు

Monkeys... Parashan with dogs.!Officials who don't care– గాయపరుస్తున్న పట్టించుకోని వైనం
– నివారించడంలో అధికారులు విఫలం
నవతెలంగాణ;మల్హర్ రావు:-
మండల కేంద్రమైన తాడిచెర్లలో కోతులు,కుక్కలతో పరేషాన్ ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.కోతులైతే రెండుమూడు రోజులకు ఒక్కరిపై దాడిచేయడం జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు మండిపడుతున్నారు.పొద్దంతా కోతుల భయంతో బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు.ఇళ్లకు తాళం వేస్తే తప్పా ఇంటి గడిలు పెట్టిన,మరిచిపోయి తలుపులు దగ్గరకు పెడితే ఇక అంతే ఇళ్లలోకి చొరబడి బియ్యం,పప్పులు తదితర నిత్యావసర సరుకులను ధ్వంసం చేస్తున్నాయి.దారి వెంటా వెళుతున్న బాటసారులపై సైతం దాడులు చేయడం జరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రంతా కుక్కల బెడద పెరిగిపోయింది.ఆహారపదార్థాలపై కోతులు,ప్రజలపై కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి.చిన్నారులు,వృద్ధులు ఒంటరిగా వెళ్లాలంటే కోతుల,కుక్కల బెడదతో జంకుతున్నారు.
పట్టించుకోని అధికారులు. .
తాడిచెర్లలో కోతులు,కుక్కలు బెడదతో ప్రజలు ఆందోళన గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.రోజురోజుకు కోతులు, కుక్కలు స్వైరవిహారం చేయడంతో గ్రామపంచాయితీ అదికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.గ్రామంలో దాదాపు 300 కోతులు,200 కుక్కలు ఉండడంతో అవి ఏ క్షణంలో దాడులు చేస్తాయోని ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని వాటిని నివారించాలని కోరుతున్నారు