జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో కోతుల, కుక్కల బెడద ఎక్కువైందని, వాటి నుంచి ప్రజలను కాపాడాలని తిమ్మాపూర్ గ్రామస్థులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో, అధికారులకు దరఖాస్తు అందించారు. గుగ్గులావత్ రవి, కూకటికారి శంకర్, దేవా రాజశేఖర్ పసుల శంకర్ మాట్లాడుతూ కోతుల కుక్కలు ఎక్కువ అవడంతో వృద్ధులను చిన్నారులు తరచి కొరికి గాయాల పాలు చేస్తున్నాయన్నారు . వాటి నుంచి గ్రామ ప్రజలను కాపాడాలన్నారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, గంగానాయక్ మల్లే శ్రీనివాస్ వెంకటేష్ నరేష్, తదితర తిమ్మాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.