వలస కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్న గుత్తా మేస్త్రీలు

– సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి  కొప్పుల  శంకర్
నవతెలంగాణ- జమ్మికుంట
  వలస కార్మికులకు తక్కువ కూలీ ఇస్తూ వారి శ్రమను గుత్తా మేస్త్రి లు దోపిడీ చేస్తున్నారని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు. గురువారం స్థానిక సిఐటియు కార్యాలయంలో గేరా రాజకుమారి అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికుల సమావేశం నిర్వహించడం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు తెలుసుకొని చర్చించడం చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కొప్పుల శంకర్ విచ్చేసి మాట్లాడారు.  జమ్మికుంట పట్టణ కేంద్రంలో కొంతమంది గుత్తా మేస్త్రీలు ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకొచ్చి, వారికి తక్కువ కూలిని చెల్లిస్తూ, మధ్యలో ఏజెంట్లను నియమించుకొని వీరు ఇరువురు కలిసి, కార్మికులను శ్రమదోపిడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొంతమంది మేస్త్రీలు కార్మికులకు కూలీ చేసిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగవేస్తున్నారని తెలిపారు. కార్మికులతో సమయపాలన లేకుండా ,అదిక పనిగంటలు పని చేయించడం జరుగుతుందన్నారు. ఇండ్ల యజమానుల నుంచి కూలీ రేట్లు పెరిగాయి అని ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ,కార్మికులకు కనీస కూలీ ఇవ్వకుండా కమిషన్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వలస కార్మిక చట్ట ప్రకారం కార్మికులతో పని చేయించుకుంటున్న మేస్త్రీలు ,కార్మిక శాఖ పరిధిలో నమోదు చేయించాలని తెలిపారు. లేనట్లయితే దీనిపై దశలవారీగా ఆందోళన పోరాటా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ సురేష్ ,రమేష్ ,నవీన్, పుష్ప, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.