వాడి వేడిగా మోపాల్ మండల సర్వసభ్య సమావేశం

నవతెలంగాణ – మోపాల్

మోపాల్ మండలంలో గల రైతు వేదికలో సోమవారం రోజున మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ లతా కన్నీరామ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొందరు సభ్యులు రైతుబంధు డబ్బులు ఇంకా పడటం లేదని ఇప్పటికే వ్యవసాయం నాట్లు ముగిసి దాదాపు నెల 15 సమయం గడిచినా కూడా వారికి పడకపోవడం బాధాకరమని వారు అగ్రికల్చర్ ఆఫీసర్ నీ వివరణ కోరారు ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఆఫీసర్ రవీందర్ స్పందిస్తూ ఇప్పటికే దాదాపు రెండున్నర ఎకరాలు ఉన్నవారికి రైతుబంధు డబ్బులు జమ అయ్యాయని అతి కొద్ది రోజుల్లో మిగతా రైతులందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు జమవుతాయని ఆయన తెలిపారు. అలాగే మన ఊరు మనబడి కార్యక్రమం నుంచి సభ్యులు పెద్ద మొత్తంలో తమ నిరసన గలన్ని తెలుపుతూ ఇప్పటికే చాలా చోట్ల తమ సొంత డబ్బులతో మన ఊరు మనబడి కార్యక్రమంలో పాఠశాలలకు నిర్మించామని ఇప్పటి కూడా తమకు డబ్బులు జమకాలేదని తమ బయట అప్పులు తెచ్చి మరి పనులు చేసే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఇలా రానున్న  రోజులు ప్రభుత్వ పనులని చేయడానికి కూడా ఎవరు ముందుకు రారని వారు ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. పాత ప్రభుత్వంలో పెట్టిన కొన్ని పంచాయతీరాజ్ నిధులను క్యాన్సల్ చేయడం కూడా తమకు నిరాశ గురి చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామాల్లో కొత్త ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి కూడా పర్మిషన్లు రాక గ్రామ ప్రజలు తమల్ని నిలదీస్తున్నారని తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలని ఎ ఈ దృష్టిక కూడా తీసుకొచ్చామని వారు తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ ఈ స్రవంతి మాట్లాడుతూ  అతి త్వరలో ఆ సమస్యలకు పరిష్కరించే విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కచ్చితంగా కృషి చేస్తానని ఆమె హామీ ఇవ్వడం జరిగింది. అలాగే సర్పంచులు పదవి కాలం ఫిబ్రవరి 2 తో ముగియడంతో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లను ఎంపీపీ లతా కన్నీరాo మరి జెడ్పిటిసి కమల నరేష్ ఎంపీడీవో లింగం నాయక్ ఎంపీఓ ఇక్బాల్ వారందరినీ సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఇందూరు సిద్ధార్థ మాట్లాడుతూ సర్పంచ్ పదవిని అత్యుత్తమైన పదవి అని దేశానికి రాష్ట్రపతి ప్రతమ పౌరుడైతే గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరుడని, నాకు రాజకీయ బిక్ష పెట్టింది మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అని నా రాజకీయ గురువు అని ఆయన తోడ్పాటు తో తన గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, నాతో పాటు ఇక్కడ ఉన్న చాలా మంది సర్పంచులకు కూడా ఆయన ఈ మండల గ్రామాల అభివృద్ధికి చేసిన కృషి మర్చిపోలేని ఆయన తెలిపారు. అలాగే ఎ ఈ ఓ చక్రపాణి మాట్లాడుతూ ఇప్పటికే మండలంలో ఉన్న ఏకైక ప్రభుత్వ బిల్డింగ్ రైతు వేదిక ఒకటి అని కానీ దానికి ఇప్పటికే 25 వేల వరకు కరెంట్ బిల్లు బాకీ ఉందని, తమ రైతు వేదికనీ హ్యాండ్ ఓవర్  చేసినప్పుడే దాదాపు పదిహేను వేలు కరెంట్ బిల్లుతో తమకు ఇచ్చారని అది పెరిగి పెరిగి 25 వేలకు దాటిందని మరి ఇక్కడ మెయింటెనెన్స్కి  కూడా తన జీతం డబ్బులు నుంచి ఖర్చు పెడుతున్నానని ఇప్పటికైనా గౌరవ ఎంపీపీ గారు దీనిని మండల పరిషత్ కంట్రోల్లో తీసుకునీ దిని బాగోగులు చూడాలని ఆయన ఈ విషయాన్ని సబా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశానికి ముఖ్యంగా వెటర్నరీ డాక్టర్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు హాజరు కాలేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ మాఫియా పై పోరాడుతుంటే ఇక్కడ మోపాల్ మండల్ లో చాలా కల్లుబట్టిలలో కల్తీకల్లు వినియోగం ఎక్కువగా ఉంది, కానీ ఇటువంటి సర్వసభ్య సమావేశానికి ముఖ్యంగా ఎక్సైజ్ అధికారులు హాజరుకాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కమల నరేష్, ఎంపీడీవో లింగం నాయక్, ఎంపీ ఓ ఇక్బాల్ పంచాయతీరాజ్ ఏ ఈ స్రవంతి, ఎలక్ట్రిసిటీ ఏఈ బాబా శ్రీనివాస్, ఇరిగేషన్ ఎ ఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఎ ఈ వినయ్, ఏపీఎం మోహన్, సూపర్డెంట్ ప్రదీప్, ఆర్ అండ్ బి ఎ ఈ, మరియు సర్పంచులు, రవి ముత్యం రెడ్డి, భరత్, సాయిరెడ్డి, కోల గంగాధర్ శ్రవణ్, లతా భూషణ్, ఎంపీటీసీలు సంగ్యా నాయక్ , రమేష్, ముత్తెన్న, రఘు, తదితరులు పాల్గొన్నారు.