అంతకుమించి యాక్షన్‌, వినోదం

అంతకుమించి యాక్షన్‌, వినోదంఅత్యంత జనాదరణ పొందిన యాక్షన్‌-కామెడీ ఫ్రాంచైజీలలో ఒకటి బ్యాడ్‌ బార్సు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు 4వ విడతగా బ్యాడ్‌య్స్: రైడ్‌ ఆర్‌ డై థియేట్రికల్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. నాలుగు రెట్లు యాక్షన్‌, నాలుగు రెట్లు వినోదాన్ని ఇస్తామంటున్న మేకర్స్‌ ఈ చిత్రాన్ని నేడు (గురువారం) మన దేశంలో విడుదల చేస్తున్నారు.  సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఐమ్యాక్స్‌ ఫార్మెట్‌లో విడుదల చేయనుంది. విల్‌ స్మిత్‌, మార్టిన్‌ లారెన్స్‌ నటించిన ఈ యాక్షన్‌-అడ్వెంచర్‌ చిత్రాన్ని ఆదిల్‌, బిలాల్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వెనెస్సా హడ్జెన్స్‌, అలెగ్జాండర్‌ లుడ్విగ్‌, పావోలా న్యూనెజ్‌, ఎరిక్‌ డేన్‌, ఇయాన్‌ గ్రుఫుడ్‌, జాకబ్‌ స్కిపియో, మెలానీ లిబర్డ్‌, తాషా స్మిత్‌తో టిఫనీ హడిష్‌, జో పాంటోలియానో కూడా ముఖ్య పాత్రల్ని పోషించారు.