రాకపోకలకు మరింత అంతరాయం

Adialabad,Navatelangana,Telugu News,Telangana.– భారీ వర్షానికి కుంగిపోయిన అప్రోచ్‌ రోడ్డు
– ఆటోలకు మాత్రమే అనుమతి
నవతెలంగాణ-దహెగాం
మండలకేంద్రం నుండి కాగజ్‌నగర్‌కు వెళ్లే ప్రయాణికులకు మళ్లీ ప్రయాణపు పాట్లు తప్పడంలేదు. అందవెల్లి వద్ద పెద్దవాగు వంతెన నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో అవస్థలు తప్పడంలేదు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అప్రోచ్‌ రోడ్డు కోసం పోసిన మట్టి మరింతగా కుంగిపోవడంతో కేవలం ఖాళీ ఆటోలు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో కారులు, జీపులు, ఇతర బరువు గల లోడ్‌తో వచ్చిన ఆటోలను సైతం అనుమతించకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. అప్రోచ్‌ రోడ్డుకు తాత్కాళిక మట్టి పోసి నెల రోజులు గడిచిపోయింది. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల పూర్తిస్థాయిలో అప్రోచ్‌ రోడ్డు పని పూర్తికాక మూడు మండలాల ప్రజలు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. మరో భారీ వర్షం కురిసినట్టయితే పూర్తి మట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిస్థాయి అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టి వంతెనను అందుబాటులో తేవాలని ఆయా మండలాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.