– బీఎస్పీ ఎంపీ రాంజీ గౌతమ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని బీఎస్పీ ఎంపీ రాంజీ గౌతమ్ అన్నారు. మనువాద పార్టీల పాలనలో దేశం మొత్తం అల్లకల్లోలమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను రాజ్యాధికారానికి దూరం చేస్తూ, వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. రెండు చోట్లా పార్టీ మరింత బలోపేతమయ్యే దిశగా ప్రజలతో మమేకం కావాలని కోరారు. కులగణన, పౌర హక్కులు, నిధులు, రాజ్యాధికారం తదితర అంశాల కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ కోఆర్డినేటర్, రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జుజ్జవరపు పూర్ణచంద్ర రావు, సెంట్రల్ కోఆర్డినేటర్ బాలయ్య, ఏపీ అధ్యక్షులు బి. పరంజ్యోతి, తెలంగాణ అధ్యక్షులు మందా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.