ప్రయాణికులు ఎక్కువ.. బస్సులు తక్కువ..

– మద్నూర్ పాత బస్టాండులో ప్రయాణికులతో బస్సులు ఫుల్
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా సరిహద్దులు గల మద్నూర్ మండల ప్రయాణికులకు బస్సు ప్రయాణాలు ఇబ్బందికరంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులు ఎక్కువ బస్సులు నడిచేవి తక్కువ మద్నూరు పాత బస్టాండ్ ఎప్పుడు చూసినా ప్రయాణికులతో కళకళలాడుతుంది. బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురు చూడవలసిన దుస్థితి బాన్సువాడ డిపో బస్సులు మద్నూర్ మండల కేంద్రం మీదుగా మహారాష్ట్ర దేగ్లూర్ పట్టణానికి నడిపిస్తున్నారు. అలాంటి బస్సుల్లో ప్రయాణికులు మహారాష్ట్ర లోని దెగ్లూరు పట్టణం నుండి దాదాపు సీట్ల భర్తీ తో రావడం మద్నూర్ బస్టాండులో ప్రయాణికులకు బస్సు ప్రయాణం సీట్లు దొరకకపోవడం స్టాండింగ్ వెళ్లాలన్న కూడా ప్రయాణికులు బస్సుల్లో పట్టని దుస్థితి రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అయినందున ప్రయాణికులు మద్నూర్ మండల కేంద్రానికి అత్యధికంగా వస్తుంటారు. బస్సుల కోసం వేచి చూడవలసిన దుస్థితి బస్సు వచ్చిన సీట్లు దొరకడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ట్రిప్పులను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తోంది. ఇలాంటి స్కీం మూలంగా మహిళలు అత్యధికంగా బస్సు ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. ప్రజల కోసం ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించినప్పటికీ బస్సు ట్రిప్పులు పెంచాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.