ప్రయాణికులు ఎక్కువ.. బస్సులు తక్కువ

More passengers. Fewer buses– సమయపాలన లేని బస్సు సర్వీసులు
– బస్సుల కోసం గంటల తరబడి ప్రయాణికుల ఎదురుచూపు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రం ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దులో ఉండటం విశేషం మద్నూర్ మండల కేంద్రం నుండి ప్రయాణికులు మూడు రాష్ట్రాలకు తరలి వెళ్తారు. మద్దూర్ పాత బస్టాండ్ లో బుధవారం నాడు ప్రయాణికులతో బస్టాండ్ అంతా కిటకిటలాడింది ప్రయాణికులు ఎక్కువ బస్సులు తక్కువ సమయపాలన లేని బస్సు సర్వీసులు, బస్సుల కోసం ఈ ప్రాంత ప్రజలు గంటల తరబడి ఎదురు చూడవలసిన దుస్థితి కనిపిస్తున్న వాటి గురించి పలుమార్లు పత్రికల్లో ప్రయాణికులు ఇబ్బందుల గురించి ప్రచురించినప్పటికీ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సర్వీస్ అధికారులు సమయపాలనతో బస్సులు నడిపించడం లేదని ఆరోపణలు ప్రయాణికుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు ఈ మధ్యలో బస్సు సర్వీస్ లేక బుధవారం నాడు ప్రయాణికులంతా గంటన్నర సేపు బస్సు కోసం ఎదురు చూశారు. బస్సులు గంటల తరబడి రాలేకపోవడాన్ని చూసి డబ్బులు పోయినా సరే అనే విధంగా ఆటోలు వెళ్దామని, కొంతమంది మహిళలు పురుషులు ఆటోలో తరలి వెళ్లారు. ఈ మండల కేంద్రం నుండి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఉదయం పూట మబ్బున ఐదు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల మధ్య ఏ ఒక్క బస్సు సర్వీసు లేకపోవడం జిల్లా కేంద్రాలకు వెళ్ళవలసిన ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ఉదయం 6 గంటలకు గానీ ఏడు గంటలకు గానీ బస్సు సర్వీసు తప్పకుండా వేయాలని ఇక్కడి ప్రయాణికులు రోడ్డు రవాణా సంస్థ అధికారులకు కోరుతున్నారు.