రవితేజ నటిస్తున్న నయా యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతోంది. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టీజర్‌తో పాటు ఈగల్ ఊర మాస్ అంథమ్ ‘ఆడు మచ్చా’ పాట చార్ట్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు పెరిగాయి. ఈ అంచనాల నేపథ్యంలో మేకర్స్ తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచుస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 20న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో రిలీజ్‌కి ముస్తాబువుతోంది.