మరిన్ని ఘన విజయాలు

విజయవంతమైన చిత్రాలతో ప్రతిభావంతమైన నటుడుగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్‌ దేవరకొండ. విజరు దేవరకొండ తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. ‘దొరసాని, మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌, పుష్పక విమానం’ వంటి సక్సెస్‌ ఫుల్‌ మూవీస్‌తో సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘బేబీ, గంగం గణేశా’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ‘బేబీ’ చిత్రానికి కలర్‌ ఫోటోతో నేషనల్‌ అవార్డ్‌ అందుకున్న సాయి రాజేశ్‌ దర్శకుడు. ఎస్కేఎన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌తో ‘బేబీ’ సినిమా మోస్ట్‌ ప్రామిసింగ్‌ అనిపించుకుంటోంది. ఈ వేసవిలోనే ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇక ఆనంద్‌ నటించిన మరో వైవిధ్యమైన వినోదాత్మక చిత్రం ‘గంగం గణేశా’. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ కాబోతున్నాయి. బుధవారం ఆనంద్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ రెండు చిత్రాల నుంచి స్పెషల్‌ పోస్టర్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. వీటితో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రకటించబోతున్నారు ఆనంద్‌ దేవరకొండ. తన బర్త్‌డేను అభిమానుల సమక్షంలో కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో ఆనంద్‌ దేవరకొండ మరిన్ని పెద్ద విజయాలు సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.