ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటుతో మరింత బలం

నవతెలంగాణ – భీంగల్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్టీలకు ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్ అన్నారు. బుధవారం భీంగల్ బస్టాండ్ వద్ద ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం సభ్యుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి, మంత్రి వర్గం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.  ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు తో గిరిజనులకు మరింత బలం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో బొదిరే స్వామి, డీసీసీ డెలిగేట్ కుంట రమేష్, రాములు నాయక్, జేజే నర్సయ్య, అనంత్ రావు, వాక మహేష్, సేవల్, అంగోత్ రమేష్, గోపాల్ రమేష్, కత్తిలాల్, అజయ్, రవి, మదన్ మోహన్, సురేష్, సంతోష్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.