నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుక్రవారం ఉదయం నుండి భారీగా వాహనాలు వెళుతున్నాయి. సంక్రాంతి పండగ ఈనెల 13 14 15 తేదీలలో ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈరోజు నుండే సెలవులు ఇవ్వడంతో హైదరాబాదు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు భారీగా వాహనాలు ఉప్పందకున్నాయి.శుక్రవారం రాత్రి వరకే దాదాపు 50 వేల పైచిలుకు వాహనాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పోలీసు అధికారులు తెలుపుతున్నారు. ఈ రద్దీ ఆదివారం రాత్రి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.చౌటుప్పల్ పట్టణంలో తంగడపల్లి రోడ్డు వద్ద భారీకేళ్ళతో రోడ్డు మూసివేశారు. ట్రాఫిక్ పోలీసులు చౌటుప్పల్ పట్టణంలో బస్టాండ్ కూడలి వద్ద వలిగొండ రోడ్డు వద్ద వాహనాలను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తున్నారు.పంతంగి టోల్గేట్ వద్ద భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. అటు పంతంగి నుండి ఇటు చౌటుప్పల్ ధర్మోజీగూడెం విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రతిసారి సంక్రాంతి పండగ చౌటుప్పల్ పట్టణ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారుతుందని పట్టణ ప్రజలు వాపోతున్నారు.