ఒకే వేదికపై 500పైగా రకాల స్వీట్స్‌

More than 500 types of sweets on one platform–  కలనరీ అకాడమీలో ప్రదర్శన
హైదరాబాద్‌ : ఒకే వేదికపై దాదాపు 500పైగా రకాల భారతీయ స్వీట్స్‌ను ప్రదర్శించారు. నగరంలోని బేగంపేటలోని కలనరీ అకాడమీ ఆఫ్‌ ఇండియాలో క్రిస్మస్‌ వేడుకల సందర్బంగా భారీ స్థాయి లో స్వీట్స్‌ను తయారు చేసి వీక్షకులను ఆశ్యర్యపోయేలా చేశారు. 350 మంది విద్యార్థులు, పాకశాస్త్ర నిపుణులు 72 గంటల పాటు శ్రమించి వీటిని తయారు చేశారని కలనరీ అకాడమీ ఆఫ్‌ ఇండియా చెఫ్‌ అక్షరు కులకర్ణి తెలిపారు.