ఊహించిన దానికి మించి..

More than expected..శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్‌ రోల్స్‌లో రితేష్‌ రానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మత్తువదలరా2’. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల13న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షుకులను అలరిస్తూ, సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ రితేష్‌ రానా మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
– మేం ఊహించిన దాని కంటే సినిమాకి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో నాతోపాటు నా టీమ్‌ అంతా హ్యాపీగా ఉంది.
– ఖుషీ రిఫరెన్స్‌ తీసుకుని అజరు క్యారెక్టర్‌ చేయాలనే ఐడియా నాదే. ఆ క్యారెక్టర్‌ గ్రో చూపించాలనేది ఐడియా. ఉన్న మూడు నిమిషాల్లో ఆయన క్యారెక్టర్‌ ఎస్టాబ్లిష్‌ చేయాలనుకున్నపుడు ఆయన చేసిన పాత సినిమాలని వాడాలకున్నాను. అలా చూసిన వెంటనే ఆడియన్స్‌ కనెక్ట్‌ అవుతారనేది ఆలోచన. ఈ ఆలోచనకి ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్‌ అయ్యారు.
– సత్య చేసిన పదహారేళ్ళ వయసు సాంగ్‌ ముందు ప్లాన్‌ చేసిందే. అది ఫస్ట్‌ పార్ట్‌లో తీసింది. అప్పుడు లెంత్‌ ఎక్కువైయిందని కట్‌ చేశాం. సెకండ్‌ పార్ట్‌లో మళ్ళీ అలాంటి సందర్భం వచ్చిందని దాన్ని ప్లేస్‌ చేశాం. థియేటర్స్‌లో ఈ సాంగ్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.
– స్లేవ్‌ డ్రగ్‌ని ఒక మెటాఫర్‌లా వాడం. మత్తు అనేది కేవలం నార్కోటిక్స్‌నే కాదు. మత్తు చాలా రకాలుగా ఉంది. మత్తు నుంచి బయటపడటం మంచిదని చెప్పడం దాని ఉద్దేశం.
– సింహ, సత్య క్యారెక్టరైజేషన్‌ గురించి చెప్పాలంటే బాబు, యేసుగా వీరిద్దరి పాత్రలు సమానంగా ఉంటాయి. బాబు లేకపోతే యేసు క్యారెక్టర్‌ అంతగా పండదు. ఇద్దరూ కాంప్లిమెంట్‌ చేసుకుని యాక్ట్‌ చేసే క్యారెక్టర్స్‌ అవి. ఫరియా కూడా అద్భుతంగా చేశారు. ఆమెని దృష్టిలో పెట్టుకునే క్యారెక్టర్‌ రాశాను. తను ఈ సినిమాకి ఒక ర్యాప్‌ సాంగ్‌ చేశారు. అది మూవీ ప్రమోషన్స్‌కి యూజ్‌ అయ్యింది. కాల భైరవతో మంచి సింక్‌ కుదిరిపోయింది. ఇన్‌ పుట్స్‌ ఏమీ ఇవ్వను. నేను సినిమా రీల్స్‌ పంపిస్తా. తను మ్యూజిక్‌ చేసి పిలుస్తారు. ఆయన మ్యూజిక్‌ సినిమాకి బాగా ప్లస్‌ అయ్యింది.
– మా నిర్మాత చెర్రీ వెరీ హ్యాపీ. ఫస్ట్‌ పార్ట్‌తో పోలిస్తే సెకండ్‌ పార్ట్‌కి ఎక్కువ బడ్జెట్‌ అయ్యింది. అయినా ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. దీనికి పార్ట్‌ 3 కూడా ఉంటుంది. అది కూడా చెర్రీతోనే చేస్తాను.
చిరంజీవి, మహేష్‌బాబు లాంటి స్టార్స్‌ సినిమా చాలా బాగుందని కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. అలాగే దర్శకుడు రాజమౌళికి సినిమా చాలా నచ్చింది. ఆయన బాగా ఎంజారు చేశారు. వీరితోపాటు ప్రేక్షకులు, మీడియా.. ఇలా ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని ప్రశసించడం ఆనందంగా ఉంది.
– దర్శకుడు రితేష్‌ రానా