అంతకుమించి దయా పార్ట్‌ 2

డిస్నీ ఫ్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘దయా’ వెబ్‌ సిరీస్‌కి విశేష ఆదరణ లభిస్తోంది. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్‌ రమ్య, కమల్‌ కామరాజ్‌ తదితరులు కీ రోల్స్‌ చేసిన ఈ వెబ్‌ సిరీస్‌ను ఎస్వీఎఫ్‌ ప్రొడక్షన్స్‌లో శ్రీకాంత్‌ మొహతా, మహేంద్ర సోని నిర్మించారు. ఈ సిరీస్‌ సూపర్‌ హిట్టైన నేపథ్యంలో దర్శకుడు పవన్‌ సాధినేని తన సంతోషాన్ని మీడియాతో షేర్‌ చేసుకున్నారు.
”దయా’ వెబ్‌సిరీస్‌కు వస్తున్న రెస్పాన్స్‌ సంతోషాన్నిస్తోంది. సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసినట్లు స్ట్రీమింగ్‌ మొదలైనప్పటి నుంచి మా వెబ్‌ సిరీస్‌ చూస్తున్నారు. ప్రతి చోట నుంచీ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. జేడీ చక్రవర్తిని దయా అని పిలుస్తు న్నారు. ఇండిస్టీ నుంచైతే చాలా కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయి. బెంగాలీ వెబ్‌ సిరీస్‌ తక్‌ధీర్‌ నుంచి ఇన్స్‌పైర్‌ అయి ఈ కథ రాసుకున్నాను. అయితే తక్‌ధీర్‌లో ఇంత విస్తతమైన కథ ఉండదు. రిపోర్టర్‌, దయా అసిస్టెంట్‌ ఇలా..ఇన్ని క్యారెక్టర్స్‌ ఉండవు. ఆ వెబ్‌ సిరీస్‌ నుంచి కేవలం ఆంబులెన్స్‌ డ్రైవర్‌కు డెడ్‌ బాడీ దొరకడం అనే అంశాన్ని మాత్రమే సెలెక్ట్‌ చేసుకున్నాను. మిగతా అంతా నేను రాసుకున్నదే. జేడీకి ఉన్న అనుభవంతో దర్శకుడి విజన్‌ తెలుసుకోగలరు. ఈ సిరీస్‌లో మీరు చూసిందంతా ఒక గ్లింప్స్‌ మాత్రమే. దయా, అలివేలు క్యారెక్టర్స్‌ మెయిన్‌గా చూశారు. అసలైన కథ, ట్విస్ట్‌లు సెకండ్‌ సీజన్‌లో ఉంటాయి. మేము ఎక్స్‌పెక్ట్‌ చేసినట్లే ఫస్ట్‌ భాగం మంచి హిట్‌ అయ్యింది. ఇక సెకండ్‌ సీజన్‌ను మరింత పెద్ద స్పాన్‌లో ఇంకా ఇంట్రెస్టింగ్‌గా చేయబోతున్నాం. దయా సీజన్‌1కు డబుల్‌ స్కేల్‌లో సీజన్‌2 ఉంటుంది. స్క్రిప్ట్‌ మొత్తం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్‌లో నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ చేయబోతున్నా’ అని దర్శకుడు పవన్‌ సాధినేని తెలిపారు.