మొరాకో మగువా…

Morocco Magua..గోపీచంద్‌, దర్శకుడు శ్రీను వైట్ల తొలి కలయికలో వస్తున్న చిత్రం ‘విశ్వం’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్‌, వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘మొరాకో మగువా’ పాటతో మేకర్స్‌ మ్యూజికల్‌ జర్నీని స్టార్ట్‌ చేశారు. చేతన్‌ భరద్వాజ్‌ స్కోర్‌ చేసిన ఈ డైనమిక్‌ సాంగ్‌కు పృధ్వీ చంద్ర, సాహితీ చాగంటి ఎనర్జిట్‌ వోకల్స్‌ అందించారు. లైవ్లీ టెంపో, షిఫ్టింగ్‌ రిథమ్స్‌తో సాంగ్‌ అదిరిపోయింది. రాకేందు మౌళి లిరిక్స్‌ తెలుగు, ఇంగ్లీష్‌ని అద్భుతంగా బ్లెండ్‌ చేసింది. పాటలో గోపీచంద్‌, కావ్య థాపర్‌ రొమాంటిక్‌ కెమిస్ట్రీ, డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో కట్టిపడేశారు. ఎక్సోటిక్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించిన విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. దీంతో ఈ సాంగ్‌ మ్యూజిక్‌ ప్రమోషన్స్‌కు చార్ట్‌ బస్టర్‌ స్టార్ట్‌ ఇచ్చింది. టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ రావడంతో ఈ సినిమాపై భారీ బజ్‌ ఏర్పడింది. దసరా కానుకగా అక్టోబర్‌ 11న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కృతి ప్రసాద్‌, సహ నిర్మాత: వివేక్‌ కూచిబొట్ల, డీవోపీ: గుహన్‌, సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, ఎడిటర్‌: అమర్‌ రెడ్డి కుడుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌: కిరణ్‌ కుమార్‌ మన్నె.