-
బ్రిటీష్ రేసింగ్ గ్రీన్ తో ప్రేరేపించబడిన MG వారసత్వాన్ని గౌరవించడానికి ప్రత్యేకమైన ‘ఎవ్వర్ గ్రీన్’ రంగును ప్రవేశపెట్టింది‘
- తమ శతాబ్ది సంవత్సర ఉత్సవాలను సంబరం చేసిన MG
నవతెలంగాణ హైదరాబాద్: MG (మోరిస్ గ్యారేజ్ లు), 100 సంవత్సరాల వారసత్వం గల బ్రిటీష్ ఆటోమొబైల్ బ్రాండ్, ఈరోజు ‘100-సంవత్సరాల లిమిటెడ్’ ను విడుదల చేసింది. 110 సంవత్సరాల బ్రిటీష్ రేసింగ్ చరిత్రకు మారు పేరుగా నిలిచిన దిగ్గజపు ‘ఎవ్వర్ గ్రీన్’ రంగును పరిచయం చేసింది. వంద సంవత్సరాలకు పైగా రేసింగ్ చరిత్రను సంబరం చేస్తూ, ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ MGని నిర్వచించే పెర్ఫార్మెన్స్ మరియు పనితనం యొక్క సారాంశాన్ని స్వీకరించింది మరియు MG హెక్టర్ లో రూ. వద్ద ప్రారంభమవుతుంది INR 21,19,800 కి, MG ZS EV రూ 24,18,000 కి, MG అస్టర్ రూ. 14,80,800, కి, మరియు MG కామెట్ 9,39,800 కి లభిస్తాయి.
Model |
Variant |
Price |
Comet EV |
Exclusive FC |
INR 9.40 Lakh |
Astor |
Sharp Pro* |
INR 14.81 Lakh |
Hector |
Sharp Pro** |
INR 21.20 Lakh |
ZS EV |
Exclusive Plus |
INR 24.18 Lakh |
*Available in MT and CVT.
**available in 5 or 7 seater capacity in petrol and diesel.
ఈ ఎడిషన్స్ ‘ఎవ్వర్ గ్రీన్’ ఎక్స్ టీరియర్ లో, బ్లాక్ ఫినిష్డ్ రూప్ తో మరియు డార్క్ ఫినిష్డ్ ఎలిమెంట్స్ తో మరియు టెయిల్ గేట్ పై ‘100-సంవత్సరాల ఎడిషన్’ బ్యాడ్జీతో పాటు లభిస్తాయి. ఇంకా, ‘100-సంవత్సరాల ఎడిషన్’ తో ఇంటీరియర్ కు పూర్తి నలుపు ఇతివృత్తం ఫ్రంట్ హెడ్ రెస్ట్స్ పై ఎంబ్రాయిడరీ చేయబడి రేసింగ్ ప్రపంచం యొక్క చరిత్రను గౌరవించే స్పోర్టీ లక్షణాన్ని అందిస్తోంది. ద లిమిటెడ్ ఎడిషన్ కోరుకున్న విధంగా విడ్ గెట్ రంగుతో
‘ఎవ్వర్ గ్రీన్’ హెడ్ యూనిట్ ఇతివృత్తంతో కూడా లభిస్తోంది. ఈ విడుదల గురించి వ్యాఖ్యానిస్తూ, సతీందర్ సింగ్ బజ్వా, ఛీఫ్ కమర్షియల్ ఆఫీసర్, MG మోటార్ ఇండియా “మా 100 సంవత్సరాల లిమిటెడ్ ఎడిషన్ విడుదల మా దీర్ఘకాల వారసత్వానికి మరియు ఆటోమోటివ్ శ్రేష్టత కోసం అభిరుచికి రుజువుగా నిలిచింది. ‘ఎవ్వర్ గ్రీన్’ రంగు మా హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది, బ్రాండ్ ను నిర్వచించే పెర్ఫార్మెన్స్ మరియు వారసత్వం యొక్క స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. తమ సుసంపన్నమైన వారసత్వం కోసం పేరు పొందిన బ్రాండ్ గా MG తమను తాను స్థిరపరచుకునే లక్ష్యాన్ని కలిగి, రాబోయే సంవత్సరాల్లో కస్టమర్స్ కోరుకున్న విధంగా కొనసాగిస్తుంది.” అని అన్నారు.
గత కొన్ని సంవత్సరాల్లో, ఆటోమోటివ్ దృశ్యం గణనీయమైన అభివృద్ధిని సాధించింది. మోటరింగ్ వారసత్వంలో చురుకైన మార్పును ప్రతిబింబించింది. ఈ ప్రత్యేకమైన ఎడిషన్ మోటార్ రేసింగ్ ప్రపంచంలో MG యొక్క వారసత్వం మరియు ఆధిపత్యాన్ని ప్రతిధ్వనిస్తోంది, ఆధునిక ప్రయాణం యొక్క భవిష్యత్తుకు దారితీసే వాహనాల శ్రేణిని అందించడానికి ముందరి స్థానంలో అంతర్జాతీయ కారు బ్రాండ్ గా మారడానికి తన నిబద్ధతను ప్రదర్శిస్తోంది. తమ సుసంపన్నమైన వారసత్వాన్ని గౌరవించడానికి MG యొక్క అంకితభావాన్ని చూపించడానికి ఇది ఒక ప్రయత్నం. ఈ లిమిటెడ్ ఎడిషన్ – సీరీస్ ఔత్సాహికులను ఆకట్టుకోవడానికి రూపొందించబడింది. MG యొక్క చారిత్రక గాథ యొక్క వాహనాన్ని సొంతం చేసుకునే విలక్షణమైన అవకాశాన్ని అందిస్తోంది.
MG యొక్క రేసింగ్ వారసత్వం
1924లో, MG బ్రిటీష్ మోటరింగ్ మార్గదర్శకుడు, విలియమ్ మోరిస్ యొక్క నాయకత్వంలో మోరిస్ గ్యారాజ్ లుగా స్థాపించబడింది. స్పోర్టియర్ అందంతో వేగవంతమైన ఆటోమొబైల్స్ యొక్క అభివృద్ధిని జనరల్ మేనేజర్ సెసిక్ కింబర్ కలలు గన్నారు. 1930 నాటికి, MG మోరిస్ ఆక్స్ ఫర్డ్ ఆధారంగా తమ ప్రారంభపు మోడల్ , 14/28 సూపర్ స్పోర్ట్స్ ను పరిచయం చేసింది. కానీ, గంటకు 65 మీ వరకు వేగంతో చేరుకునే సామర్థ్యం గల నాజూకైన టూ-సీటర్ బాడీని కలిగి ఉంది. 1931లో, MG, ‘ద మేజిక్ మిడ్ గెట్’ గా కూడా పిలువబడే MG EX120తో చరిత్ర సృష్టించింది, మరియు ప్రతి గంటకు 103.13 మీ అత్యంత వేగం సాధించడం ద్వారా 750 సీసీ కార్స్ కోసం గుర్తించదగిన ల్యాండ్ వేగం రికార్డ్ నెలకొల్పింది.