నవతెలంగాణ – మోర్తాడ్
మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ టీ పెద్దన్న తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పిఎం ఉషా పథకం కింద 13 కళాశాలలకు నిధులు మంజూరు కాగా నిజాంబాద్ జిల్లా నుండి మోర్తాడ్ కళాశాలకు మాత్రమే ఐదు కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. మోర్తాడ్ డిగ్రీ కళాశాలకు నిధులు మంజూరుకు కృషి చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో కళాశాల మౌలిక వసతులు క్లాస్ రూమ్ లో ల్యాబ్ గ్రంథాలయం తదితర అభివృద్ధి పనులకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.