గిరిజన గ్రామాల్లో దోమల మందు పిచికారి

నవతెలంగాణ – అశ్వారావుపేట
వినాయకపురం పి.హెచ్.సి పరిధిలోని తిరుమలకుంట కాలనీ,తోగ్గూడెం లో మంగళవారం దోమల మందు పిచికారి ని స్థానిక సర్పంచ్ సున్నం సరస్వతి ప్రారంభించారు. దోమల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రజలను కోరారు.దోమలు కుట్టకుండా,పుట్టకుండా జాగ్రత్తలు ప్రజలు తీసుకుంటే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటాయని వివరించారు.రెండు గ్రామాల్లో 149 గృహాల్లో దోమలు స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు, విజయా రెడ్డి, పంచాయతీ సెక్రటరీ మహేష్, సత్యనారాయణ, ఆశా లు పాల్గొన్నారు.